అమృతమూర్తులయిన అమ్మ,నాన్నలకు " పెద్దమ్మాయి " గా,
పెద్దచెల్లి వాణమ్మకు " అక్క" గా,
బుల్లి చెల్లెళ్ళు రామం, అరుణలకు " పెద్దక్క " గా,
బంగారు తమ్ముడు ఫణి కి " పేద్ద.. పెద్దక్క " గా,
పౌరుషానికీ, పంతాలకీ ప్రతీక గా
" పరిమి " వారింటికి " ఆడబడుచు " గా,
"చిట్టి అమ్మన్న" గారికి " మనవరాలు కోడలి" గా,
భమిడిపాటి వారింటి " బుల్లి కోడలు" గా,
బంగారం లాటి శ్రీవారికి " అమ్మడు " గా,
బంగారు తల్లి రేణు కి " మమ్మీ " గా,
బంగారు తండ్రి హరికి "అమ్మ " గా,
జామాత విశాల్ కి " మమ్మీ " గా,
పుత్రవధు శిరీషకి " అత్తయ్య గారు " గా,
చిన్నారులు తాన్యా, ఆదిత్య లకు " అమ్మమ్మ " గా,
బుజ్జాయిలు నవ్య, అగస్థ్య లకు " నానమ్మ " గా,
( ఎక్కడో... సంతూర్ సబ్బు యాడ్ వస్తోందనుకుంటా......)
పాపా.. పాపా.. నీ పేరేంటమ్మా ?
దేవీ నవరాత్రుల్లో, సూర్యోదయ సమయంలో...
"
సప్తమి" ( సూర్య) లక్షింవారం ( లక్ష్మి)
ఇదమ్మా పేరు.....
పేరు ఒకటి, మనిషీ ఒకటే, రూపాలు ఎన్నెన్నో బంధాలు ఎన్నెన్నో......
ఇన్ని మమతానుబంధాలతో.. జీవితమే సఫలమూ....
7 కామెంట్‌లు:
ఈ భమిడి పాటి వారల
బ్లాగు బాగు బాగు
బ్లాగు స్పాటు నందూ వున్నారు,
వర్డ్ ప్రెస్సు నందూ వున్నారు
వెరసి మంచి విషయాలు చెబుతూంటారు !
చీర్స్
జిలేబి.
ఈ రోజు మీపుట్టినరోజా మీ పరు గురించి చెప్పారు .
హాపీ బర్త్ డే .
నమస్కారండి... ఇంక నుంచి మీమ్మల్ని ఫొలో అవుతాను..
chaala baavundandi
@జిలేబీ,
ధన్యవాదాలు...
@మాలాకుమార్ గారూ,
పుట్టినరోజు కాదండీ.. ఏమిటో పిల్లలందరినీ ఒకేసారి చూడ్డంతో "సెంటీ" అయిపోయాను. దానికి సాయం పాత ఫొటో ఒకటి దొరికింది. సరదాగా నా భావాలు వ్రాశాను. ధన్యవాదాలు.
@రాజాచంద్రా,
థాంక్స్...
@అన్నపూర్ణా,
ధన్యవాదాలు..
లక్ష్మీపతి నామ్యాం అని ఆయన చెబుతారు. మీరేమో ఇల్లాగా. వెరసి అంతా ఒకటే.
బాగుందండీ మీ ప్రవర.
సుబ్రహ్మణ్యం గారూ,
ధన్యవాదాలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి