RSS

గణపతి బప్పా మోరియా !! పుడిచే వర్ష లౌకర్ యా!

   గణపతిబప్పా మోరియా, రాబొయే సంవత్సరంలో తొందరగా రావయ్యా! అంటూ వీడ్కొలు చెప్పడం అలవాటేనూ!! మరి ఇందులొ మోరియా అంటే ఏమిటని నా స్నేహితురాలు అడిగితే , ఏం చెప్పాలో తెలియలేదు. సరే నని నాకు తెలిసినది,కొంత గూగులమ్మనూ అడిగి సమాధానం చెప్పాననుకోండి. కొన్ని పదాలు మనకి తెలియకుండానే వాడేస్తూవుంటాము. కాని తెలుసుకుంటే దాని ఆనందమే వేరు.

   పూణె చుట్టుపక్కల అష్టవినాయకుల మందిరాలు చాలా చెప్పుకొతగినవి.అందులో మోరేశ్వర్ మందిర్ ఒకటి.మోర్ అంటే నెమలి. నెమళ్ళు ఎక్కువగా వుండటం వలన మోర్ గావ్ అని భౌగోళికంగా ఈ గ్రామం నెమలి ఆకారంలో వుండటం వలన ఈ గ్రామానికి మోర్ గావ్ అని ఇక్కడి వినాయకుడ్ని మోరేశ్వరని అంటారు.అంతే కాదు ఇక్కడి వినాయకుడు నెమలి వాహనం పై దర్శనమిస్తాడట.ఇది చూసేందుకు మసీదు ఆకారంలో వుంటుందట. దీనికి చుట్టు పెద్ద ఎత్తయినా రక్షణ గోడ , దానికి నాలుగు ద్వారాలు, ఎనిమిది మూలలకు ఏకదంత, మహోదర, గజానన, లంబోదర,వికట,నిజ్ఞరాజ,ధూమ్రవర్ణ,వక్రతుండ విగ్రహాలు వుంటాయట.

    ఇంక "మోరియా" శబ్దానికి తెలిసికున్న అర్ధమేమంటే-- 14 వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని శాలిగ్రాం గ్రామం నుంచి వచ్చిన "మోరియా" అనే భక్తుడు, పూణె కి దగ్గరలో మోర్గావ్ అనే స్థలంలో "మయూరేశ్వర్" అనే దేవాలయం స్థాపించారుట. మహరాష్ట్ర లోని "అష్టవినాయక" యాత్ర ఇక్కడితోనే మొదలౌవుతుంది. అక్కడే ఆయన 'సంజీవని" సమాధి పొందారుట. ఈయన నామస్మరణే "గణపతి బప్పా మోరియా" లోని "మోరియా"...

    ఇంకా వివరాలు తెలిసికోవాలంటే ఇక్కడ చదవండి. .

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇది మరాఠీ భాషలోంచి అరువు తెచ్చుకున్నది. ఎంతకాలం మనం అవతల వాళ్ళని అనుసరిస్తూ తెలుగుకి నీళ్ళ వదుల్తూ ఉంటామో అంతకాలమూ మన పరిస్థితి ఇలాగే ఏడుస్తూ ఉంటుంది. గణేశ నవరాత్రుల్లో ఏ ఒక్కడైనా 'ఓ బొజ్జ గణపయ్య.." అనే తెలుగు పాట పాడడం విన్నారా? ఇది మన తెలుగు, మన దేశం చేసుకున్న దౌర్భాగ్యం.

హొటల్లో కూడా 'చారు" అనకోడదుట. స్టైల్ గా 'రసం" అనాలిట. "అప్పడం" అనకూడదు. "పాపడ్" అనాలి. "అప్పడం" కి ఇంగ్లీషు ట్రాన్సులేషన్ ఏమిటో అడగండి ఏ కుర్రాణ్ణైనా? "పాపడ్" అంటాడు. ఏమిటో రోగం తెల్సా? ఆ దరిద్రం వాడి తల్లితండ్రులు అంటించారు వాడికి. "రసం" ఎందుకంటే అది తమిళం వాళ్ళు మనకంటించిన పిండాకూడు కాబట్టీ, అది మనకి బాగా నచ్చుతుంది కాబట్టీ. ఒక పది సంవత్సరాల్లో తెలుగులో పోతన అంటే ఎవడూ చెప్పలేడు కానీ సుబ్రమణ్య భారతీ, పురందరదాస అంటే గుక్క తుప్పుకోకుండా చెప్పగలరు. ఇది రాబోయే ప్రమాదం - జస్ట్ వెయిటింగ్ టు హేపెన్.

తెలుగు వెధవ బాష. దాన్ని వదిలేయండి. బాంబే లో ఇలా చేస్తున్నారు గణేశ నవరాత్రులు, మనం కూడా ఇలాగే అఘోరిద్దాం. అక్కడ బప్పా మోరియా, పుడిచే వార్షిక్ అంటున్నారు, తెలుగులో కూడా అలాగే ఏడుద్దాం. మనకి సొంత ఏడెంటిటీ ఒకటి ఏడ్చిందా ఏంటి? అవతలి వాళ్ళు అంటించిందే మనకి అందం. తెలుగులో బ్లాగు మొదలెట్టడం, నాలుగు లైన్లకి ముఫ్ఫై తప్పులు. ఆ మాత్రం ఓపిక లేనివాళ్ళు తెలుగు బ్లాగు మొదలెట్టడం ఎందుకో?

ఏ మరాఠీ అయినా, తమిళ వాడైనా తెలుగులో 'ఓ బొజ్జ గణపయ్య" అనమనండి చూద్దాం? పురుగుని చూసినట్టు చూస్తాడు మనల్ని. మనకి అది నచ్చుతుంది.

గణేశా, నువ్వేనా వింటున్నావా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత గారూ,

మీకు తెలుగు భాష మీదున్న అభిమానానికి జోహార్లు. నేను వ్రాసిన దానిమీద మీరు అంతగా ఉద్రేకపడవలసిన అవసరం ఉందనుకోను.

"తెలుగులో బ్లాగు మొదలెట్టడం, నాలుగు లైన్లకి ముఫ్ఫై తప్పులు."-- ఆ తప్పులేవో చూపిస్తే సంతోషించే దాన్ని. నేను మూడు సంవత్సరాలుగా తెలుగులో టపాలు వ్రాస్తున్నాను. మేము గత 40 సంవత్సరాలుగా పూణె ( మహరాష్ట్ర ) (మళ్ళీ మీకు తెలియదేమో అని)ఉంటున్నాము. నా టపాలు చదివేప్రతీవారికీ ఈ విషయం తెలుసును. బహుశా మీరు మొదటిసారి నా టపా చదువుతున్నారేమో..
బప్పా మోరియా అనే మాట, గణపతి నవరాత్రుళ్ళో ప్రతీ నోటా వింటాము ఇక్కడ. కానీ చాలా మందికి దాని అర్ధం తెలియదు. తెలుగు భాషని తక్కువ చేద్దామనే ఆలోచనైతే లేదు నాకైతే.
నా టపాలు నచ్చకపోతే చదవడం మానేయండి. లేదా యాగ్రిగేటర్లకి చెప్పండి.
వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sunnA చెప్పారు...

నమస్తే
ఒక అనామకుడు పెట్టిన కామెంటు కి భయపడితే ఎలా సారూ? నేను మీ ఇద్దరి టపాలూ చదువుతున్నాను రెగ్యులర్ గా. తప్పకుండా రాస్తూ ఉండండి. ఆయన చెప్పింది, హైద్రాబాద్, ఆంధ్రా గురించి అవ్వొచ్చు. అందరికీ మీరు పూణేలో ఉన్నారని తెలియపోవచ్చు కదా?

ఆవిడకి చెప్పండి. తెలుగు లో రాసేవాళ్ళు రాస్తూ ఉండాలి. ఆ అనామకుడి బదులు నేను చెప్తున్నాను కదా, మీరు తప్పకుండా రాయండి.అదీగాక, ఇంటర్నెట్టు మీద కొంచెం థిక్ స్కిన్ ఉండాలండోయ్! ఒక వెధవ కామెంట్ కి భయపడితే ఎలా? మీ ఆవిడ పెట్టిన సమాధానం కూడా నేను చదివేను. మెత్తగా చురక అంటించేరు వాడికి. వీపు కాలి ఉంటుంది. ఇంక మాట్లాడడు.

PS:- I put the same comment in your husband blog too.

శ్రీలలిత చెప్పారు...


నిజంగానే "గణపతి బప్పా మోరియా.."అంటూ మోరియా అనే మాటకి అర్ధం యేమిటనేది ఆలోచించకుండానే అనేస్తున్నాము. సూర్యలక్ష్మిగారూ, మీరు శ్రమ తీసుకుని గూగులమ్మలో దాని అర్ధం వెదికి పట్టుకుని ఇంత అందంగా మాకు అందించినందుకు ధన్యవాదాలండీ. ఇప్పుడు మేము నోరారా ఆ గణపతిని కీర్తించవచ్చు..మరోసారి ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

లక్ష్మి గారు
మనసు బాగోలేని ఒకానొక క్షణంలో ఆ కామెంట్ రాసిన వెధవని నేనే. క్షమాపణలు. దయచేసి బ్లాగు రాయడం కొనసాగించండి.
మొదటి అనామక

అజ్ఞాత చెప్పారు...

లక్ష్మి గారు
మనసు బాగోలేని ఒకానొక క్షణంలో ఆ కామెంట్ రాసిన వెధవని నేనే. క్షమాపణలు. దయచేసి బ్లాగు రాయడం కొనసాగించండి.
మొదటి అనామక

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

sunnA,

మీరన్నట్టుగా థిక్ స్కిన్ ఉండాలనుకోండి. కానీ, సందర్భం లేకుండా, అలాటి వ్యాఖ్య చూసేటప్పటికి, కొద్దిగా బాధ పడ్డాను.
పోన్లెండి అయిపోయిందేదో అయిపోయింది.

శ్రీలలిత గారూ,

ధన్యవాదాలు. ఇన్నేళ్ళనుంచీ వింటున్నా, అసలు అర్ధం ఇప్పుడే తెలిసికున్నాను.ఆ ఉత్సాహంలో అందరితోనూ పంచుకోవాలనిపించింది.

అజ్ఞాత,

గతం గతః
మీ వ్యాఖ్య ధర్మమా అని వీక్షకులు ఎక్కువయ్యారు. ధన్యవాదాలు.

sameera చెప్పారు...

మీ దంపతుల బ్లాగీయం ఉగాది పచ్చడి లా వుంటుంది :-)వీక్షకుల సందడి Contraversy వల్ల ఎక్కువ అయిందని మంచి చురకేవేసారు !

Zilebi చెప్పారు...



అజ్ఞాత కేక ద్వారా ఈ టపా కి గణపతి బప్పా తన మోరియా ప్రాచుర్యాన్ని తెలియ జేసు కొన్నాడేమో నండీ భమిడిపాటి వారు

చీర్స్
జిలేబీ

Bindu చెప్పారు...

అజ్ఙాత గారు రాసింది చదివితే నవ్వు వచ్చింది. చెప్పింది నిజమే కానీ కొంచం కించపరిచే విధంగా ఉంది. మీ సమాధానం చక్కగా, diginified గా ఉంది లక్ష్మి గారు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సమీరా,

పోనీయండి.. కానీ నేనన్నదీ నిజమేగా....

జిలేబీ,

నిజమేనండీ.. ఈ విషయమే తట్టలేదూ...

బిందు,

Thanks.. ఆ విషయం ఇక వదిలేద్దాము...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes