RSS

అప్పుడూ..ఇప్పుడూ..

    టైము ఎంత తొందరగా గడచిపోతోందో కదా... మొన్న ఒకటో తారీకున, మా మనవరాలు చి.నవ్య స్కూల్లో Grand Parents Day అని, నేనూ, మా శ్రీవారూ స్కూలుకి వెళ్ళాము.ఆరోజున మా నవ్య కోలీ డాన్సులో నృత్యం చేసింది. ఆ ముస్తాబు చూసేసరికి 34 ఏళ్ళ క్రితం, మా అమ్మాయి చి.రేణు ని, వాళ్ళ స్కూల్లో ఏదో ఫాన్సీ డ్రెస్ కోసమని, ఓ చీర కట్టి , ముస్తాబు చేయడానికి నేనూ, మా ఆడబడుచూ ( పిన్నత్తగారి కూతురు) పడ్డ తిప్పలు గుర్తుకొచ్చాయి !

   ఇప్పుడంటే అవేవో చిన్నపిల్లలు వేసికునే కల్పనా శారీలూ అవీ వచ్చాయి కానీ, ఆ రోజుల్లో నా దగ్గర ఉండే ఓ కంచి పట్టుచీరే కట్టవలసివచ్చింది. మార్కెట్ లో దొరికేవేమో, కానీ ఆ రోజుల్లో ఒక్క రోజుకోసం, అంతంతఖర్చు పెట్టే స్థోమతా ఉండేది కాదు.ఏదో ఉన్నదాంట్లోనే, చేసేద్దాములే అన్న భావనా కావొచ్చు. ఏదైతేనేం పని కానిచ్చేశాము.నా చీర, అన్నన్ని మడతలు,కుచ్చిళ్ళు పెట్టి, బట్టనిండా పిన్నీసులూ ( జారిపోకుండా ఉండడానికి !!).

    అదేదో పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అన్నట్టు, ప్రొద్దుటే ఏడింటికల్లా ముస్తాబు చేసేయడం, ఏ పదింటికో కార్యక్రమమూ, ఆ తరువాతేమో ఓ ఫొటో ఒకటి తీయించొద్దూ, అదో తంతూ, ఆ రోజుల్లో ఇంట్లో కెమేరాలూ అవీ ఎక్కడా, ఓ ఫొటో స్టూడియోకి తీసికెళ్ళి,ఫొటోలూ, పాపం వెర్రితల్లి ఎంత శ్రమ పడిందో!!

   ఇప్పుడైతే ఫొటోలూ వగైరాలన్నీ ఇంట్లోనే పూర్తయ్యాయి. రోజులు మారినా, ఇంట్లో ఓ బంగారు తల్లి ఉంటే చాలు, మనకి కావలిసినన్ని చేయొచ్చు.

11 కామెంట్‌లు:

Kishore చెప్పారు...

ఇంట్లో ఓ బంగారు తల్లి ఉంటే చాలు, మనకి కావలిసినన్ని చేయొచ్చు. -- సరిగా చెప్పారు. చిన్నారికి నా అభినందనలు.

Unknown చెప్పారు...

మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరూ చక్కగా ఉన్నారు మీ మనుమరాలికి అభినందనులు

జీడిపప్పు చెప్పారు...

అభినందనలు!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కిషోర్, రమేష్, జీడిపప్పు గారూ,

అభినందలకి ధన్యవాదాలు...

అజ్ఞాత చెప్పారు...

baavunnaru iddarki photos okelaa baaga teeyinchaaru.polikalu vunnayandi Atta..menakodaliki

Unknown చెప్పారు...

manchi gnapakalu. iddariki polikalu unnai

Unknown చెప్పారు...

manchi gnapakalu. iddarki polikalu bagane unnai

Unknown చెప్పారు...

manchi gnapakalu. iddaraki polikalu bagane unnai

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాతా,

అమ్మాయికి స్టూడియోలోనూ, మనవరాలికి ఇంట్లోనూ తీసిన ఫొటోలు.. ధన్యవాదాలు...

జ్యోతీ,

ధన్యవాదాలు..

శ్రీలలిత చెప్పారు...


జన్మదిన శుభాకాంక్షలండీ..
google+లో చూడండి..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీలలితగారూ,

ధన్యవాదాలండి..

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes