RSS

స్క్రీన్ షాట్లూ, పీడీఎఫ్ లూ....

ఇది వరకు వారపత్రికలలో వంటలూ - వార్పులూ , కథలూ- కవితలు , పాటలు - పద్యాలు , ముఖచిత్రాలు పుస్తకాల అట్టలకి, పక్కింటి అమ్మాయి కి ముగ్గులు - అల్లికలు   అవి తీయగా  ఓ పది కాయితాలు మిగిలేవి పేపరు రద్ది వాడి కిచ్చేందుకు.
 . ఆ తర్వాత  అవి అలాగే చదవడం , అవి కలగాపులగా అవడం, అప్పుడు కొంచెం కాయితాలయితే ' స్టేప్ లరు'  తో పిన్ చేయడం, ఎక్కువగా వుంటే కంఠాణీ తో లేకపోతే మేకు తో మూడు కన్నాలు చేసి దారంతో కుట్టుకొని చదవడం , బాగుండేది ! అవి  కలబోసిన కదంబ మాల గా ,  నెల చివరి రోజ్జుల్లో మధ్యతరగతి సబ్బులాగ  (అరిగి పోయిన సబ్బు ముక్కలన్ని కలిపితే రంగు రంగుల సబ్బు మిశ్రమ వాసనలతో వుంటుంది లెండి !)  ఇంక ఆ కాగితాలు  అప్పుడు అటు ఇటూ పెత్తనాల కెళ్ళడం.
అంగుళాల గ్రాఫ్పేపరు మీద ఇంటూ మార్కు లతో మేటీ డిజైను , కార్బను పేపరు తో ఎంబ్రాయిడరి డిజైనులు తీసుకోవడం !
 భలే గా వుండేది!
 అదే అలవాటు తో ఇప్పుడు అంతర్జాలంలో పాత పత్రికలలో  నేను పుట్టని క్రితం కథలు చదవడం , చిన్నతనం లో నాకు నచ్చి , కుట్టేందుకు కదరని డిజైను కంటపడేసరికి , గ్రాఫ్ పేపరు, పెన్సిల్ తో  తయారయ్యాను.  అది చూసి మా శిరీష ఒక నెమలి ని ఎదురు బెదురుగా నాకు కావలసిన విధంగా చేసి  పది నిమిషాలలో printout  ని నా చేతిలో పెట్టింది. సంతోషమే సంతోషం ! చిన్నపిల్లలా కుట్టడం పూర్తిచేసాను. ఇంతకు ముందు చాలా పెద్ద డిజైనులు కుట్టినా అవి అన్ని ఒక ఎత్తు . ఇదొక ఎత్తు . దీనితో చిన్నతనం జ్ఞాపకాలు , అవీ గుర్తొచ్చాయి .అవన్నీ అటకెక్కేసి ఇప్పుడేమో స్క్రీన్ షాట్లూ, పీడిఎఫ్ లూనూ... ఆరోజుల్లో కొన్ని గంటలు పట్టేవి, ఇప్పుడేమో క్షణం లో అయిపోతోంది...

మొట్టమొదటి సారి ప్రచురింపబడిన ఆణిముత్యాలు. ఓ రెండు 







., నేను కుట్టిన డిజైన్ 





2 కామెంట్‌లు:

అన్యగామి చెప్పారు...

ఈమధ్యన మీ పోస్టులన్నీ ఒక్కసారి చదివాను. వాటిల్లో ఎక్కడో మీరు డబ్బావాలాలతో పేచీ గురించి వ్రాసినట్టు గుర్తు, ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి?

http://www.bbc.com/future/story/20170114-the-125-year-old-network-that-keeps-mumbai-going

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ధన్యవాదాలండీ!!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes