సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిధ్ధిద్బవతుమే సదా,
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ.
నవ భారత సారధ్యానికి నేను సైతం అంటూ ,రాబోయె సోమవారానికి మూడు వసంతాలు నిండబొయె పుత్తడిబొమ్మ నవ్య ఈ సోమవారమే గురుకుల ప్రవేశం చేయబోతోంది. (స్కూలు లొ చేరుతోంది).
సిరి నగవుల సింగారానికి
హరి మౌము అరవిందానికి
నానమ్మ నయనతార నవ్యకి
కావాలి మీ అందరి దీవెనలు.
(పాడినది బాల సరస్వతి గారు ) మాఇంట్లొ పాడినది నవ్య అమ్మమ్మగారు. (బాలనందం సభ్యురాలు)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
మాపాప చదవాలి మా మంచి చదువు -- " బం"
మా పాప పలికితే మధువులే కురవాలి
పాపాయి ఆడితే పాములే ఆడాలి
పలు దేశములకు పోయి తెలివిగలపాపాయి
ఘన కీర్తి తేవాలి, ఘన కీర్తి తేవాలి-- "బం"
ఏ దేశమే జాతి ఏవరింటిదీ పాప
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు -- "బం"
తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి మురిపించాలి
మానోములపుడు మా బాగా ఫలియించాలి--" బం"
ఈ పాటని అమ్మ దగ్గరే నేర్చుకొని హైదరాబాదు రైల్వె స్టేషనుకి మేము వస్తూంటే కారులొ ముద్దుముద్దుగా పాడి వాళ్ళ అమ్మమ్మని మురిపించేసిందిలెండి.
1 కామెంట్‌లు:
మీ బంగారు తల్లి చదువుల తల్లి కావాలని బామ్మ కలల పంట కావాలని ఆశీర్వదిస్తున్నాము.
ఈ బంగారు పాపాయిపాట మాఇంట్లో కూడా పిల్ల లందరికీ పాడుతుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి