సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విధ్యారంభం కరిష్యామి సిధ్దిద్బవతు మే సదా,
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ.
నవ భారత సారధ్యానికి నేను సైతం అంటూ రాబోయె సోమవారనికి మూడు వసంతాలు నిండబోయె పుత్తడిబొమ్మ నవ్య ఈ సొమవారమే గురుకుల ప్రవేశం.(స్కూలు లొ చేరబోతోంది)
సిరినగవుల సింగారానికి
హరిమోమున అరవిందానికి
నానమ్మ నయనతార నవ్యకి
కావాలి మీ అందరి దీవెనలు
(పాటపాడినది బాల సరస్వతి గారు) మా ఇంట్లొ పాడినది నవ్య అమ్మమ్మ గారు(బాలనందం సభ్యురాలు)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
మాపాపచదవాలి మామంచి చదువు--"బం"
మాపాప పలికితే మధువులే కురవాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
పలు దేశములకు పోయి తెలివిగల పాపాయి
ఘన కీర్తి తేవాలి ,ఘన కీర్తీ తేవాలి --"బం"
ఏదేశమే జాతి ఎవరింటి దీ పాప
యెవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మామంచి చదువూ--"బం"
తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి మురిపించాలి
మానోములప్పుడు మాబాగ ఫలియించాలి--"బం"
ఈపాటని అమ్మ దగ్గర నేర్చుకొని హైద్రాబాదు రైల్వే స్టేషనుకి మేము కారులొ వస్తూంటే ముద్దుముద్దుగా పాడి వాళ్ల అమ్మమ్మని మురుపించేసిందిలెండి.
6 కామెంట్‌లు:
మూడోఏటనే బడికి !?
ఇకఏం మిగిలింది బాల్యం ఆచిన్నారులకు ?
రెక్కలు విరిచి పంజరం లో కూర్చోబెట్టిన చిల కల్లా పలికే వాల్ల పాటల ముచ్చటితప్ప మనకు సీతాకోక చిలుకల్లా ఎగురుతూ ,పాడుతూ,ఆడుతూ నేర్చుకోవాల్సిన సంతోషాన్ని కాలరాస్తున్నామన్న గ్రహింపు మనకు రాదు.
కనీసం బడివయస్సు ఐదు సంవత్సరాలనే విషయాన్ని మరచి బుజాలన బ్యాగుల బరువులు మోపి నీ బాల్యాన్ని కర్కశంగా అణచివేస్తున్న మాపెద్దరికాలను బుజ్జీ ! క్షమించు .
నవ్యకు శుభాశీస్సులు.. సరస్యతి కటాక్ష ప్రాప్తిరస్తు...
మీ బంగారుతల్లి చదువుల తల్లి కావాలని కోరుతూ,
సకల విద్యా ప్రాప్తిరస్తు.
బంగరు పాపాయి పాట మా పిల్లలందరి కీ ఇష్తమైన పాట.
దుర్గేశ్వరగారికి,
గ్రహించి చేసేదేమిలేదు. ప్రస్తుత విద్యావిధానం అలావుంది.ప్రస్తుతం రెండు సంవత్సరాలవరకు ఈ గురుకులంలో ఆటలు,పాటలు,కధలే వుంటాయి.అదే సంతోషం.
జ్యోతిగారికి, మాలాకుమార్ గారికి
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి