అమ్మొ ! కొద్దిరొజులు కూడలి కి దూరంగా వుంటే నా ' ఇదీ సంగతి" శీర్షిక మరొకరు పెట్టేసుకున్నారు. ఇలా గయితే ఎలాగండీ?, పొన్లే పెట్టుకున్నవారికి తెలియకపోవచ్చుననుకోండి, చదివినవారి దృష్టి లొకి వచ్చివుండాలే, పొన్లే వారికి వాళ్ల టపాలు రాసుకుందుకు పోస్టు చేసుకొందుకు , వాళ్ళ కామెంట్లు చూసుకొందుకు సమయం సరిపోయిందనుకోండి, శ్రీవారి సంగతి ఏమిటి? కనీసం తనకయినా గుర్తుండవద్దా?చెప్పండీ?, ఇదండీ లోకతీరు. అంతేకదా ఈ రొజుల్లో, ఎదురుగా వున్నంతవరకే,లేకుంటే ఎవరికి వారే యమునాతీరే! పొద్దుగడి వచ్చేసింది. కాని ఇంకా స్లిప్పుల గడి రాలేదు. ఈ సారి తేలిగ్గా వుందనుకుంటాను.స్లిప్పుల అవసరం లేకుండానె వచ్చేసిందనుకుంటాను. ఎందుకంటే నాకే వచ్చేసినట్లుగా అనిపిస్తోంది.గడి వచ్చినతరువాత నాకు బోలెడు కాలక్షేపం. అది చదవడం నింపడం, రానివి ఓ కాయితం మీద రాసుకొని అవే ఆలోచించడం, హఠాత్తుగా ఆ పదం తట్టేసరికి ఎక్కడవున్నా, ఎంతమందిలోవున్నా, సరే వావ్! అనుకొని గబగబా ఆ పదం నింపడమ్. అదొక అలవాటు, నషా. కాని ఎప్పుడూ ఒకటొ రెండొ పదాలలో బండి ఆగిపోతుంది. అయినా మానను. అలా ఆలొచిస్తూనే వుంటాను. ఈనాడు ఆదివారం అనుబంఢం. సాక్షి ఆదివారం, రచనలొ , ఆంధ్రభూమిలో, దొరికిన అన్ని పుస్తకాలలొ, ముందర వీటి కొసమే చూస్తాను. ఎప్పటికో అప్పటికి సాధిస్తాను. అదృష్టం బాగుండి అన్ని నింపకలిగితే దాన్ని పంపేసమయం దాటిపోతుంది, ఒకవేళ సమయానికి నింపి మాశ్రీవారికిచ్చి పంపడి అని చెప్పి యిస్తే తనకి గుర్తువుండదు, అది అలాగే వుండిపోతుంది. ఆ తరువాత మాటామాటా, చిన్న తగాదా, ఆ తరువాత మళ్ళీ మామూలేను. ఇదండి సంగతి.
శీర్షిక కబ్జా
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 24, అక్టోబర్ 2009, శనివారం
2 కామెంట్లు:
లక్ష్మిగారు,
ఖంగారు పడకండి.మీ శీర్షిక ఇలాగే ఉంచండి.మీరు ముందు వచ్చారు కాబట్టి మీరు మార్చనక్కరలేదు. గడి వచ్చింది తెలీదు.మీ టపా చూసాక పొద్దుకు వెళ్లాను. మీరు స్లిప్పులు ఇవ్వడంలేదు.ఇది అన్యాయం..
జ్యోతి
స్లిప్పుల గడిలో అడుగు పెట్టేసానండీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి