RSS

పంజాబి డ్రెస్

   మేము తిరిగి పూనా వచ్చామనితెలిసి మా పాత స్నేహితులు ఒక్కొక్కరే వచ్చి చూసివెడుతున్నారు. నిన్న ఒకావిడ వచ్చారు.అవి ఇవి కబుర్లు అయిన తరువాత ఒకామె పేరు చెప్పి ఆమెని కలిసావా అని అడిగింది. మేము తరచూ కలుస్తూనే వుంటాను.మీరు దూరం వెళ్ళిపోయారు కాని మేమంతా చిట్ (కిట్టిపార్టి) పార్టి వాళ్ళమే కదా! ఎందుకు అడుగుతున్నావని ఆడిగితే అప్పట్లొ మనము సల్వార్ ,కుర్తాలు వేసుకుంటే మనకి ఎన్ని పేర్లు పెట్టేదో కదా మరి ఇప్పుడు తను కూడా వేసుకొంటొంది చూసావా?
పోనిలే యిప్పటికయినా అందులో సుఖం తెలిసింది అని చెప్పి పంపించేసాను. కాని ఆ తరువాత నాకు పాత రోజలు గుర్తుకువచ్చాయి.

    నేను చదువుకునే రోజుల్లొ ఎన్.సి.సి. లో వుండేదాన్ని.మాస్కూల్లొ పెరెడ్ అయితే తెల్లరంగు పంజాబి డ్రెస్ పాలిటెక్నిక్ కాలేజ్ వెడితె కాకి డ్రెస్ వేసుకునేవాళ్ళం. మిలటరి మేజర్ అనుకుంటాను ఆయన వచ్చినా కాకి డ్రెస్ వేసుకునేవారము.ఇంక మా యింట్లొ అ బట్టలు ఓ చేతి సంచిలో పెట్టి వరండా లో ఓ మేకుకి తగిల్చిపెట్టవలసినదేను. లోపలకు ప్రవేశం వుండేదికాదు.ఎన్.సి.సి వున్నప్పుడల్లా ఆలస్యంగా యింటికి రావడం చివాట్లు తినడం ఎప్పుడూ ఒకటే డైలాగు ఎన్.సి.సి.యా దిబ్బ సి.సి.యా అంటూ, అయినా అల్లాగే వెళ్ళేదాన్ని. కారణం నాకు అ బట్టల మీదున్న మోజు కొద్దీ, ముఖ్యంగా పంజాబి డ్రెస్ అంటేను--(అప్పట్లొ అలాగే అనేవారు) స్కూల్లో యిచ్చేవారబట్టలుఅవి మూడే సైజుల్లొ వుండేవి.తెల్లరంగు బూట్లు.వాటిని సన్ లైట్ సబ్బు లేకపోతే 501బార్ సబ్బు తొ వుతుక్కొని,భయపడుతూ,భయపడుతూ నాన్నగారిని ఓ పావలా అడిగితీసుకొని చాకలితో ఇస్త్రీ చేయించుకొని స్కూల్లొ పెరెడ్ ముందర స్కూల్ యూనిఫామ్ తీసి యివి వేసుకొని మళ్లి ఎన్.సి.సి. క్లాసు అయిన తరువాత యివి మార్చి మళ్ళి యూనిఫాం వేసుకొని యింటికి రావలసివచ్చేదాన్ని.ఇంత శ్రమ పడినా కేంప్ కి పంపలేదు, సర్టిఫికెట్ రాలేదు.అది వేరె సంగతనుకోండి..

    పెళ్లి అయి వచ్చిన తరువాత మా వారికి ఎలాంటి అభ్యంతరం లేదు కనుక అస్తమాను కాకపోయినా అప్పుడప్పుడు వేసుకునేదాన్ని.మా అమ్మాయి పెళ్ళయి మనవరాలు పుట్టిన తరువాత ఎక్కువగా వేసుకునేదాన్ని.ఎందుకంటే అమ్మాయి ఎప్పుడూ ఫొను చేస్తే అప్పటికప్పుడు మా అబ్బాయి అన్ రిజర్వుడ్ కంపార్టుమెంటులొ కర్కీ స్టేషనులొ కూర్చ్బెడితే కళ్యాణ్ లొ దిగెతే మా అల్లుడు స్కూటర్ మీద డోంబ్విల్లి వాళ్ళ యింటికి తీసుకువెళ్ళెవాడు.ఆ సందర్బంలో ఓ సారి ఓ ప్రయాణీకురాలి చీర ఆ జనంలో వూడిపోయింది.పాపం సిగ్గుతో ఎంతో బాధ పడిపోయింది. అప్పటినుండి నెను ప్రయాణానికి చేతిలో చిన్నసంచి, ఓ హెండ్బాగ్. చక్కగా డ్రెస్ వేసుకోవడమ్ అలవాటు అయిపోయింది.దూర ప్రయాణాల్లొ బెర్తు మీద ఎక్కేందుకు,కొంతమంది అదే పనిగా చూస్తూవుంటారు,వాళ్ల కళ్ళకి గొళ్ళాలు, మన మెడలో వుండే గొలుసుకి (కనీసం సూత్రాల తాడు వుంటూందిగా)సేఫ్టీ.(యిది అప్పట్లొ మాట.)
మార్నింగ్ వాక్ కి ఈవ్నింగు వాక్ కి మా వారితో బయటకు వెళ్ళేటపుడూ చిట్ పార్టీలకు పిక్నిక్ లకూ యిప్పుడూ అంతేను,
అప్పట్లో డ్రెసులు వేసుకున్న మమ్మల్ని ఏదో ఒకటి అంటూండేవారుసరదాగాను, వ్యంగంగాను కూడాను,యిప్పుడు వాళ్ళే కొడుకులతో కోడళ్ళతో,మనవలతో బయటకు వెళ్ళినా పూజలకు పేరంటాలకూ వెళ్ళ్లినా డ్రెస్సులతో వెడుతూవుంటే చిత్రంగావుంది.
అందుకనే నోటినుంచివెలువడిన మాట, జారిన అవకాశం , గడచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరావు.అప్పుడు అలా అన్నందుకెగా యిప్పుడుఆవిడ గురించి చెప్పుకునేది,

   సరే ఇంతకీ చెప్పెదేమిటంటే నిన్న మాశ్రీవారు బేర్ ఆడిటింగుకి వెడుతుంటే ముందు నేను బయలదేరాను కాని తరువాత నాకు పని వుందని చెప్పి మానేసాను.దానికి ముందు డ్రెస్ తీసుకోవాలట.ఆ తరువాత మార్చలంట,అప్పడు ఆల్టర్ చేయించాలట, నేను కూడా వెడితే ఆమాత్రం తెలీదా అని అనుకుంటారని,తప్పుకున్నాను, నిజంగానే తను తెచ్చిన తరువాత మార్చవలసివచ్చింది,చుడీదారు తెచ్చారుఅది మార్చి సల్వారు తెప్పించాను, ఆ తరువాత ఈవిడ రావడం దాని తో ఈ ఆలోచనలన్నీను----.

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నమస్తే అండీ, మొత్తానికి మిమ్మల్ని పట్టేసాను. మీరు రాస్తున్నట్టు మీ పతిదేవుని బ్లాగ్లో చదివానులెండి.

సృజన చెప్పారు...

నచ్చింది!!

భావన చెప్పారు...

బాగుందండి. చాలా సార్లు అలానే చేస్తాము. మనం చేసేదే ఏదో ప్రపంచ ప్రమాణమైనట్లు అది కాక వేరే విధం గా చేసే వాళ్ళు పనికి రానట్లు ఫీల్ అవుతాము. బలే సున్నితం గా చెప్పేరు. :-)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

లలిత,
దొరికిపోయానన్నమాట.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సృజన
ధన్యవాదాలు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

భావన,
కొంతమందికి సిగ్గు,మనసునూ, అందులోంచి బయటపడేందుకు సమయం పడుతుంది.

మాలా కుమార్ చెప్పారు...

నాకూ అంతే నండి డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్ గా వుంటుంది . పార్లర్ కు , జీన్స్ , కుర్తా వేసుకెళ్ళేదానిని . ఇంటికి రాగానే చీర లోకి మారిపోయేదానిని . మా అత్తగారు , మామగారు కూడా అర్ధం చేసుకున్నారు . ఏమీ అనేవారు కాదు . ఇప్పుడైతే ఇంట్లో కూడా ఎక్కువ గా డ్రెస్ లే వేస్తుంటాను . మా పిల్లలు మాడరన్ గ్రానీ అంటుంటారు .

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలాకుమార్ గారూ,

ఎవరో ఏదో అనుకుంటారని,మన కంఫర్ట్ లెవెల్ తగ్గించుకుంటామా?

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes