ఏడాదినుండి బ్లాగ్గులు వ్రాస్తున్నాను. ఎంతండీ, మాశ్రీవారు ప్రారంభించిన పది పదిహేను రోజులకి మొదలెట్టాను.నాకేమైనా రిటైరుమెంటా,ఆయనలా రోజూ ఒక్కో బ్లాగ్గు పోస్ట్ చేయడానికీ, ఇల్లంతా తుడుచుకోవడం,తడిగుడ్డతో మళ్ళీ తుడవడం,వంటా వార్పూ,పూజా పునస్కారం ఎన్ని పనులు? ఆయన ఛాన్సు దొరికితే కంప్యూటరు ముందర సెటిల్ అయిపోవడం.ఇంక నాకెక్కడదీ ఛాన్సూ? ఏదో సంసారపక్షంగా ఉంటుందీ అని ఏవేవో వ్రాసేదాన్ని.జనసంచారం ఎక్కువ ఉన్నట్టు కనిపించలేదు, మా శ్రీవారి ఇంగ్లీషు బ్లాగ్గులా! ఓవైపు ఆయనేమో, రోజుకోబ్లాగ్గుచొప్పున వ్రాసుకుంటూ పోతున్నారు, పైగా 300 పైచిలుకి వ్రాసేనని ఓ గొప్పా!వ్రాసుకోవడం మానేసి,నాలా ఇంటిపనులు చూడమనండి,తెలుస్తుంది,ఎవరెక్కువ వ్రాయగలరో!వదిలేయండి ఆ గొడవ,ఇక్కడ ఎవరెక్కువ వ్రాశారూ అని కాదు,ఆయనదానికి అంత ట్రాఫిక్‌కు ఎందుకొస్తోందీ అని ఆలోచించా.ఆయనేమీ తెలియని విషయాలు వ్రాయడంలేదు,వ్రాసే భాషలో తేడా! పైగా ఈ విషయం ఆయనతో అన్నానంటే ఇంకా నెత్తికెక్కేస్తారు!పైగా ఛాన్సుదొరికితే తూ.గో.జి, ప.గొ.జీ అంటారు.అలాటివారినడిగి లాభంలేదు.మనమే ఏదో పరిష్కారం ఆలోచించాలి. ఎనాలిసిస్ మొదలెట్టాను.ఆయన వ్రాసే పధ్ధతి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష ఉంటుంది.అంతకంటె ఎక్కువేం ఎక్స్ పెక్ట్ చేస్తాంలెండి... అయ్య నాశ్రీవారూ ఇదన్నమాట కిటుకు! పైగా ఈమధ్యన చాలా బ్లాగ్గుల్లో నామీద ఆడిపోసుకోవడంతోటే సరిపోతూంది. టిట్ ఫర్ టాట్, ఆమాత్రం నాకు వ్రాయడం రాదా అనుకుని రాణి రుద్రమదేవినీ, ఝాన్సీలక్ష్మీ బాయినీ గుర్తుచేసేసుకుని, ' భాగ్ ఫిరంగీ భాగ్ ఫిరంగీ...' అనుకుంటూ మొదలెట్టేశాను. కానీ ఇలా వ్రాయడం మొదలెట్టిన తరువాత అనుకున్నాను- ఈ వయస్సులో పాపం ఆయన్ని కష్టపెట్టడం ఎందుకూ అని, అయినా ఆయనెక్కడికి వెళ్తారు-మామిడికాయ పప్పూ, కందా బచ్చలి కూర,ఆవపెట్టి కూరలూ చేసి ఈయన వేవిళ్ళకోరికలెవరు తీరుస్తారులెండి? ఈవేళ్టికీవేళ, మామిడికాయపప్పూ, చామదుంప (ఉప్మా) కూర చేస్తే ఆవురావురుమంటూ తిన్నారు! అయినా చదివేవాళ్ళున్నారనీ, వినేవాళ్ళున్నారనీ, మరీ పేట్రేగిపోతే ఎంతకాలం ఊరుకుంటాం చెప్పండి. ఎప్పుడూ ఆయనవ్రాసేవే చదివేసి, నన్నేదో రాక్షసనుకుంటారని,నేనూ ఉన్నదేదో వ్రాస్తున్నాను.
ఒక్కవిషయం గమనించాను-ఇలా పధ్ధతి మార్చేటప్పటికి, ఎప్పుడూ రాని వారు కూడా నా బ్లాగ్గులోకి వచ్చి 'ఇక్కడేదో గొడవ జరుగుతోందీ' అని పసికట్టేశారు! పైగా ఇప్పుడు పాత బ్లాగ్గులు చదువుతూంటే, ఛా ఇదేమిటీ మరీ చాదస్థంగా వ్రాశానూ అనిపిస్తోంది
An Idea changes life!!
అదన్నమాట సంగతి!!
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 24, జూన్ 2010, గురువారం
18 కామెంట్లు:
ఇప్పుడు అసలు కిటుకు తెలుసుకున్నారుగా. ఇక విజృంభించండి. ఆయన పది టపాలకు ధీటుగా మీ ఒక్క టపా చాలదు. అంతగా ఫణిగారు అలిగారనుకోండి, ఇష్టమైన వంటకాలు చేసిపెట్టండి. కూల్ ఐపోతారు.
భాగ్ ఫిరంగి మాత్రం అదిరింది. :))
భలే.. బాగుంది ... ఇద్దరినీ చూస్తుంటే చూడ ముచ్చటగా.. భార్యా భర్తలు ఇంత చక్కగా బ్లాగ్స్ వ్రాయడం ఇదే ప్రధమం అనుకుంటా ఈ బ్లాగ్ లోకం లో ..
నువ్వెంతంటే నేనింతంటూ బలే వుంది మీ జోడీ
అవునని ఒకరూ అది కాదని ఇంకొకరూ ఖుషీయేకద మీకెపుడూ
కాలక్షేపం కావాలంటే కదలక్కర్లేదు ఇంకెక్కడికీ
మాకు అలాకాదుకదా.. మావారొక పుస్తకాలపురుగు
మరి నేనేమో ఊరంతా తిరుగు...
భార్యా భర్తలిద్దరూ ఇలా సై అంటే సై అంటేనే కదండీ బాగుండేది.ఏ గొడవా లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది.
మీరిద్దరూ ఇలా ఉంటేనే బాగుంది.మీకెందుకు మీరు విజృంబించేయండి, తేడా వస్తే మేమున్నాం కదా!!!
మీ ఇద్దరూ ఇలా సరదాగా పోట్లాడుకుంటూ వుంటారనే , నా బ్లాగు లో కూడా చెప్పాను కదండి .
చూసారా ?
జ్యోతీ,
ఎంతకాలం ఓపిక పడతాం చెప్పండి !
నేస్తం,
మా ఇద్దరి బ్లాగ్గులూ నచ్చుతున్నందుకు థాంక్స్.
మంచుపల్లకీ,
థాంక్స్
శ్రీలలితా,
భగవంతుడి దయతో రోజులు ఇలాగే వెళ్ళాలని ప్రార్ధిస్తున్నాను.
నీహారికా,
మీరందరూ ఉన్నారనే ఈ మాత్రం రిస్కు తీసేసికున్నాను!
మాలాకుమార్ గారూ,
చదివాను. చాలా బాగుంది.
నా అజ్ఞానాన్ని ఇగ్నోర్ చేసి (ప్రాస కోసం వాడేను) మీ వారి బ్లాగ్ అడ్రస్ కొంచెం చెబుతారా? సంగతేమిటో చూద్దాము :).
నేను మాత్రం ముందు మీ బ్లాగ్లె కనుగొన్నా...ఆ తరువాతే బాబాయిగారి బ్లాగ్ ని చదవడం మొదలుపెట్టాను.
ఎదేమైనా ఎవరి వ్రాసే తీరు వారిది...ఇద్దరూ విభిన్నంగానే వ్రాస్తారు.
నాకైతే మీరిద్దరూ సమానమే...మీరు కొంచం ఎక్కువ సమానం! ;)
రామ,
పోన్లెండి, వదిలేయండి.ఆయన బ్లాగ్గు http://harephala.wordpress.com లోకి కూడా ఓసారి తొంగి చూడండి !!
ఏరిఎన్,
ధన్యవాదాలు.
అమ్మా!
ఈ 'అఙ్ఞాత ', 'Anonymous' లాంటి పెంట, పంది వెధవల్నీ, ముండల్నీ, బ్లాగులోకం లోంచి తరిమి కొట్టండి.
"ఒరే! నేను రోజూ రాత్రి మాదాకోళం వేసే కుష్ఠు ముష్టివాడి (నువ్వు మగాడివైతే) కొడకా! (నువ్వు ఆడదానివైతే) కూతురా! (రెండూ కాకపోతే) కొజ్జా! మరెప్పుడు నా బ్లాగులోకి రావద్దు! అని.
మీకు మాలాంటివాళ్ళ సపోర్టు యెప్పుడూ వుంటుంది.
కృష్ణశ్రీ,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి