ఈ రోజు శ్రావణ మంగళగౌరి నోము చేసుకునే వారికి మొదటి మంగళ వారం. నోము చేసుకోక పోయినా మంగళగౌరిని అందరం ఆరాధించి ఆమె దయకు పాత్రులమవచ్చును.పరాశక్తి మంగళగౌరి దేవి. ఆమెని సేవించిన వారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి.అందులోనూ శ్రావణ మంగళవారాలంటే ఆమెకు ఎంతో ప్రీతియట.శ్రావణమాసంలోనే కాకుండా ప్రతి మంగళవారం అఖండ సౌభాగ్యనికి అనుకూల దాంపత్యానికీ ప్రతి మంగళవారం చదువుకునే శ్రీ మంగళగౌర్యష్టకము.
శివోమా పరమాశక్తి రనంతా నిష్కళామలా
శాంతామాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా // 1
అచింత్యాం కేవలా నందా శివాత్మా పరమాత్మికా
అనాది రవ్యయా శుధ్ధా సర్వాత్మా సర్పగాచలా // 2
ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా
మహామహేశ్వరీ సత్యా మహాదేవీ నిరంజనా // 3
కాష్ఠా సర్వాంతరాస్థా చ చిఛ్ఛక్తిరతిలాలసా
తారా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపామృతాక్షరా // 4
శాంతిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తి రమృతప్రదా
వ్యోమమూర్తి ర్వ్యోమలయా వ్యోమాధారాచ్యుతామరా // 5
అనాదినిధనామోఘా కారణాత్మా నిరాకులా
ఋతప్రథమ మజా నీతిరమృతాత్మాత్మసంశ్రయా // 6
ప్రాణేశ్వరీప్రియతమా మహామహిషఘాతినీ
ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ // 7
సర్వశక్తి ర్నికారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాస్పదా
సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ // 8
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి