మేము వెళ్ళిన దివేఘర్ ప్రదేశం చాలా బాగుంది. ఆకాశంలో మబ్బులు, మద్య మధ్యలో మమ్మల్ని పలకరించే వాన చినుకులు, మరో నిమిషంలో పెద్దవాన, మరు నిమిషంలో చిన్న యెండ, చుట్టూవున్న కొండలన్ని పచ్చని చెట్లతో ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టుగా, తెల్లని వెండి ఆభరణాలా అన్నట్లుగా , చిన్న పెద్ద జలపాతాలతో ,సగం మబ్బుల్లొ దాక్కుని మాతో దోబూచులాడుతూ, మమ్మల్ని కూడా మబ్బుల్లో చుట్టేసి మమ్మల్ని తాకూతూ మాకందకుండా పారిపోతూ , వాహ్! అద్బుతం! ఆనందం! పదాల్లో రాయడం కుదరదనుకోండి, అనుభవించి, ఆనందించి , మన మనసులో దాచుకోవలసినదేనూ! అల్లాంటి దృశ్యాన్ని ఏ కెమేరాలోనూ బంధించలేం.
దివేఘర్ లో"సువర్ణ గణేశ్" చూడవలసిన ది.ఇది కధ కాదు, ఎప్పటి సంగతో కాదు, చరిత్ర అంతకన్నా కాదు.కొబ్బరిచెట్లు, పోకచెట్ట్లుతో వున్న తోటలో" శ్రీమతి ద్రౌపతి ధర్మ పాటిల్" కి సుమారు రెండు అడుగుల లోతులో 30 కిలోల రాగి పెట్టె దొరికిందట. ఆ రోజు సంకష్ట చతుర్ధి.( నవంబరు నెల 17 తేది,1998 సంవత్సరం) ఆ పెట్టె పైన కాల్చినట్లుగా మెరుపు అంతా పోయి బాగా వెడి చేసి, ( అంటే కాల్చినట్టుగా) వుందట.దాని మీద సంస్కృతంలో ఏవో పదాలున్నాయట.ప్రభుత్వ అధికారుల సమక్షంలొ తెరెచిచూస్తే అందులో స్వచ్చమైన బంగారంతో చెసిన గణపతి , మరో చిన్న రాగి బాక్సులో ఆ దేముని ఆభరణాలు వున్నాయట.పూర్తి 24 కారెట్లు బంగారమైన ప్రతిమ 1కిలో పైన 300 గ్రాములు బరువుతో 24 అంగుళాల ఎత్తు తో వుందట.పరీశిలించగా తేలినదేమిటంటేనట అది ఒక రాతి గణపతి యొక్క తొడుగు . ఇంతకీ అది ఎవరు భూమిలో పాతిపెట్టారో, ఎందుకు పెట్టారో , ఏ గణపతి విగ్రహం తొడుగో, ఏమీ తెలీదు.మిస్టరీ గానే వుంది. ఇక్కడి ప్రజలు మాత్రం ఎంతో భక్తి శ్రద్దలతో, గణపతి మందిరంలో గణపతి విగ్రహం పక్కన పెట్టి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూన్నారు. మేము కూడా చూసి వచ్చాము. ఆ రాగి పెట్టె, నగలపెట్టె కూడా అక్కడే వుంచారు.ప్రకటిత స్టలం చూసి బయటకి వచ్చేసరికి అక్కడ మొక్కల్లొ గణపతి సోదరుడు కూడా సాక్క్షాత్కరించాడు. కొమ్మ మీద పాము ని చూసి భయపడ్డా ధైర్యంగానే వున్నాను. ప్రకృతికి దగ్గరగా వున్నపుడు ఇలాటివి కూడా తప్పదు కదా మరి.
సువర్ణ గణేష్
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 17, ఆగస్టు 2011, బుధవారం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి