మా చిన్నపుడు ఆదివారాలు తలంట్ల కార్యక్రమంలో మా అమ్మమ్మ చెబుతు వుండేవారూ భూలోకంలో " నిత్యతలంటు, వార భోజనం" అని దండోరా వేసి రమ్మని బ్రహ్మదేవుడు పంపితే వాడు ఇక్కడికి వచ్చి " వార తలంటు, నిత్య భోజనం " అని వేసాడట. దాంతో వారం వారం తలంట్లు, రోజూ భొజనాలు మొదలయ్యాయట. లేకపోతే బియ్యానికి బదులుగా కుంకుళ్ళు,కుంకుళ్ళకి బదులుగాబియ్యం తీసుకునే పరిస్థితి వచ్చి వుండేదన్నమాట. పెద్ద పెద్ద సంసారాలు, పరిమితం కాని కుటుంబాలు . మధ్య తరగతి లోని ఇల్లాలు వండి వడ్డించలేక సతమతమైపోయేదట. ఓ మహా ఇల్లాలు దేవుని పేరు చెప్పి శని వారాలు ఓ పూట ఉపవాసం మొదలుపెట్టించిదట. సరే! ఇది బాగానే వుంది , పుణ్యానికి పుణ్యం, భోజనానికి బదులుగా పాలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్య మని చాలా మంది మొదలుపెట్టారట.రాను రానూ పాలు, పండ్లు మానిన, మానకపోయినా ఛేంజ్ ఆఫ్ ఫ్హుడ్ అంటూ ఇడ్లీలు, దోశలూ, చపాతీలు, పూరీలు, పెసరట్లు మొదలయి ఇంటి ఇల్లాలుకి నడుంవిరిగే పని పెరిగిపోయింది. అలా,అలా దేవుని పై భక్తో, పుణ్యమో తెలీదుకాని , మేము శనివారం ఫలానాది చేసుకున్నామని చెప్పుకోవడం ఓ ఫాషను అయిపోయింది. వెంకటరమణుడిని తలచుకోకపోయినా ,శనివారం అనేసరికి బంగాళ్దుంప కూరతో చపాతిలు, ఉల్లిపాయతో సాంబారు లో ఇడ్లీలు తినే భక్తులని చూస్తూ వుండిపోయాడు... వెర్రి వెయ్యి తలల్తో విజృంభిస్తున్న సమయంలొ ఓ మహాఇల్లాలు " జై జవాన్, జైకిసాన్", నారా తో శాస్త్రి గారి మాటలకు ఉత్తేజపడి " సోమవారం" సాయంత్రం భోజానాలు మాని ఉపవాసం మొదలు పెట్టేసరికి ,అలా అలలా , ఇల్లిల్లు , ఊరు ఊరు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మా ఇంట్లోనూ చెసేవారు. అంతే కాదూ, రోజూ ఎసట్లో బియ్యం పోసె ముందు ఓ గుప్పెడు బియ్యం తీసి వేరే డబ్బాలో పోసి పొదుపు చేసేవారు. దైవ భక్తి కంటె దేశభక్తి తో ఉపవాసం వుండేవారు, తినేటప్పుడు శుభ్రంగా తినేవారు, పొదుపు చేసేవారు.ఇంటి పట్టున వుండేవారు. ఇప్పుడు రోజూ, షాంపూ స్నానాలు, డబ్బాలో భోజనాలు. వంటావిడకి ఉదయమే వచ్చి చేసేందుకు కుదరదు కనుక రుచి పచి లేని కూరలు చపాతిలు అదీ నూనె లేకుండా, కారం వుండకూడదు.టోన్డు పాలతో తోడుపెట్టిన పెరుగు.ఇదీ భోజనం. ఏడువారాల నగల్లాగ రొజుకో "సిరియల్" బ్రేక్ ఫాస్ట్. వారంలో 5 రొజులు ఇదే తిండి. వారాంతానికి రెండు రొజుల్లో ఓ రోజు పాస్తా, నూడిల్సు, లేకపోతే పిజ్జ. అది మళ్ళీ చీజ్ ది, ఇంకో రోజు భోజనానికని చెప్పి ఓ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వెళ్ళి 5 నక్షత్రాల హుటెల్ లో తనివి తీర కడుపు నిండా తినొచ్చి అలసిపోవడం, దీనితో అనారోగ్యం సరిగా నిద్ర లేకపోవడం, వర్కు ఫ్రెం హోమ్ అనిచెప్పి రాత్రి పని , కాల్సు. సమతల ఆహారం , నిద్ర లేక అనారోగ్యం, ఊరిపోయే ఊబకాయం, దాని కోసం త్రెడ్ మిల్లులు, సైకిలింగులు. పిల్లల ఆటలు, చదువులు ఒకటె గందరగొళం, ఇంచుమించుగా అందరింట్లోను ఇదే తంతు. తలంటు స్నానాల తరువాత సాంబ్రాణి పొగ తో జుట్టు ఆరబెట్టుకొవడం,వదులు జడ, రెండు జడలు, పర్సు జడ, ఈత ఆకు జడ.. పెద్దలయితే జడ అల్లి సిగ, ఒకరు జుట్టు మెలిపెట్టి సిగ, మరొకరు బన్ పెట్టి ముడి.రింగు పెట్ట్టి ముడి ఎలాంటి అలంకరణ అవండీ, ఆ సీజను లో దొరికే పువ్వులు పెట్టుకోవడం లో ఓ రకమైన ఆనందం.ఈ తరం వారికి పిల్లలకి, పెద్దలకి కూడా " బాయ్ కట్" బాబ్డ్ కట్" " యు కట్" తప్పితే జడలు అల్లడం తెలియదనే చెప్పుకొవాలి. ఓ క్లిప్ పెట్టేసుకొవడం, బస్! అంతేనూ.... పువ్వులంటారా ఆ సంగతే వదిలేయండీ! మా లాంటి వాళ్ళం పూర్వపు వారిలాగా వుండలేం, ఇప్పటి తరం వాళ్ళ వేగానికి, పరుగులకి తట్టుకోలేం, ఇంతకీ చెప్పేదేమిటంటే షాంపు స్నానమైన ఏదో ఒకటి నిత్య తలంటు వచ్చేసింది. కడుపు నిండా తినే భోజనం వారానికి ఓ సారే అవుతోంది. ఈ తరంలో కూడా ఓ మహా ఇల్లాలు పూనుకొని మంచి స్నానం, సమయానికి సరైన భోజనం, కంటి నిండుగా నిద్ర పోవాలని బోధించే సమయం రావాలని అశిస్తూన్నాను సైకియాట్రిస్టుల దగ్గరకి వెళ్ళవలసిన, అవసరం రాకూడదని ఆశిస్తూ.....
అలాటి అవసరం రాకూడదనే ......
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 6, ఫిబ్రవరి 2012, సోమవారం
7 కామెంట్లు:
na chinnapati vishayalu gurtuku techharu...thanks
entha chakkaga chepparu andi...:-)
entha chakkaga chepparu adi :-)
చిన్నప్పుడు శనివారం కోసం ఎదురు చూసేవారం. ఉప్పిడిపిండి, కొయ్య రొట్టె, దిబ్బరొట్టే, పిండి పులిహార,చల్లట్లు వగైరా వగైరా. నిజమే కదా ఉపవాసం అని మొదలుపెట్టి పొట్ట పగిలేలా తినడం.
బాగా చెప్పారు.
భలే బాగా చెప్పారండీ... అన్నీ నిజాలే ...... తెలిసీ ఏమీ చేయలేని స్థితి.....
బాగుందండీ...
@సాయి,
ధన్యవాదాలు..
@సమీరా,
నచ్చిందా అయితే. థాంక్స్..
@సుబ్రహ్మణ్యం గారూ,
మా శ్రీవారు ఆదివారాలు కూడా చేసేవారు...
@మాధవీ,
ఔను కదూ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి