ఈమధ్య ఆంధ్రా వెళ్ళి రావడంతో చుట్టాలు స్నేహితులుని కలవడం జరిగింది. కష్టం, సుఖం , మంచి చెడ్డ అన్ని మాట్లాడుకున్న తరువాత నాలో కలిగిన ఆలోచనాస్రవంతి అనుకోండీ భావావేశం అనుకున్నా సరే , అర్దం చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్తనీరు వస్తుంది, పాతనీరు కొట్టుకుపోతుంది. ఎల్.సి.డి. టి. వి. లు వచ్చి పాత "సోని" రంగుల టి.వి. లు కొట్టుకుపోయాయి.నలుపు తెలుపు ఫొటొల ఆల్బమ్స్ అటకెక్కాయి,పిల్లల చిన్నప్పటి కలరు ఫొటొలు కింద గూళ్ళల్లో సర్దుకున్నాయి.వ్యాసపీఠాలమీద పెట్టి చూడవసినంత పెద్ద సైజులో ఆల్బమ్స్ వచ్చాయి.మొబైల్ ఫొటొలు, డిజిటల్ ఫొటొలు వచ్చాయి.జీవం వుట్టి పడే బ్లాక్ అండ్ వైట్ ఫొటొలు ,ఆ జ్ఞాపకాలు అందుబాటు లో లేకుండా ఇప్పటి ఫోటొలు చూసి ఏ బ్యూటీషన్ దగ్గర మేకప్ చేయించుకున్నదీ, ఎవరు ఏపట్టుచీర కట్టారు?అరే! మళ్ళీ అదే రిపీట్ చేసారే? ఇదీ తంతు--- అడ్మినిస్ట్రేషను మారింది.పాతపని వాళ్ళ జాగాలొ కొత్త పని వాళ్ళు వచ్చారు..నడిమింటి వాలు కుర్చీ వసారా లాంటి బాల్కనీలో చేరింది.ఇంటి యజమాని పడక మాస్టర్ బెడ్ రూమ్ నుండి గెస్టు రూమ్ కి మారింది.అభిమాన రచయితల , రచయిత్రుల పుస్తకాలు పెద్ద అల్మారులో ఏటవాలుగా ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకునే వీలుగా, విశాలంగా వుండేవి, కుదురుగా కింద అరనుండి పై అరకు అంటుకునేలా కుదుమట్టంగా చీమ దూరే సందు లేకుండా పొరబాటున బ్రహ్మ కూడా ఒక్క పుస్తకం తీయలేని విధంగా సర్దుకుంటే గొంతు నొక్కేసినట్లుగా వుండదూ?-- ఎంతో మక్కువ తో అల్లిన స్వెట్టర్లు, ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్లు, కుషన్ కవర్లు దాన ధర్మాలకి అదేనండి అనాధాశ్రమాలకి వెళ్ళిపోయి, అత్తగారిచ్చిన ఇత్తడి సామాను అటకెక్కిన ఆల్బమ్స్ కి జత చేరిపోతే, ఆటయినా , డ్రాయింగైనా, పైంటింగైనా, ఏదయినా ఒకటి పూర్తి చెసి మరోకటి మొదలుపెట్టాలమ్మా అంతే,కాని అదోసారి ఇదోసారి చేస్తే అన్ని అసంపూర్తిగానే వుంటాయమ్మా, ఆ పనయిన తరువాత అవన్ని మళ్ళి వాటి జాగాలో పెట్టేసుకోవాలమ్మా,అనిచెప్పే పెద్దావిడకి, " అలా చెబితే పిల్లల్లో ఆసక్తి, క్రియేటివిటీ తగ్గిపోతాయి, మీరు చెప్పే మాటలు, పాటలు, కధలు అన్ని పాతచింతకాయ లాంటివి , " ఆపిల్ల తల్లి మాటలు వినేసరికి ఇంకో రెండుబ్లడ్ ప్రెషర్ మాత్రలు వేసుకునే పరిస్థితి.--- కందకి ,కాందాకి ( ఉల్లిపాయ) తేడా తెలియని పిల్లలకి పప్పు , కూర వేసి పెరుగు వేసి ఇంటి భోజనానికి దూరం చేసి, పిజ్జాలు , బర్గర్లు, కురుకురెలు, ఫాస్టు ఫుడ్ లు అలవాటు చేసి , అడిగినవన్ని యిచ్చి, " లేదు, కాదు, వద్దు" అనే పదాలకి అర్దంకూడా తెలియకుండాపెంచితే రేపు జీవితంలో ఆటూ, పోటూ తట్టుకొని, ఎలా బతుకుతారు? ఇంకొకరితో షేరు చేసుకోవడమన్నదే తెలియటం లేదు, చిన్నప్పుడు చిన్నవి, పెద్దయిన తరువాత పెద్దవీ అన్నీ అడిగినవీ యివ్వగలమా? --- మరొకటి,కొత్తగా ఇంట్లోకొచ్చినామెకు ఇంట్లో సరుకులన్ని పాత గానే కనిపిస్తాయి.పాత మంచాలు, పాతఫ్రిజ్, పాత ఓవెన్, పాత వాషింగ్ మెషీన్, అని కొత్త పాటమొదలవుతుంది.ఈ పాత వస్తువులే కొత్తాలో కొనేందుకు , వచ్చిపోయే బంధువులతో, పిల్లలకు లోటు లేకుండా పంచవర్ష ప్రణాళికల బడ్జెట్ తో పొదుపు చేసి కొనుక్కునేసరికి తాతలు దిగిరాలేదు కాని వీళ్ళు మాత్రం తాత లయిపోయిన, వారి అవస్థ ఎవరికి అర్ధం అవుతుంది?అంత శ్రమ పడి కొనుక్కున వస్తువులు చలనం వచ్చి మారి పోతూంటే చేసేదేమీ లేక చేతులు ముడుచుకు కూర్చొని ఎంత ఉక్కిరి బిక్కిరయిపోతున్నారో --- మారిన కాలంలో మారని తరం మనుష్యులు మనుమలు , మనవరాండ్ర మైకంలో పడి వారికి, వారి తల్లితండ్రులకి మధ్యలో నలిగి సతమతమయే శాండివిచ్ జనరేషను మాయలోబడి, " మేమూ మారామనే" నటిస్తారు. మరువలేకపోతే మసకబారిన కళ్ళకు " కళ్ళద్దాలు" తుడిచి పెట్టుకుంటారు.అయినా లాభం లేకపోతే పవరు పెరిగిందని సర్దుకుంటారు. --- " కొత్త నీటి వరదకి దారిచ్చి ,పాతనీరు పక్క నుండైనా ముందుకి సాగిపోవాలి ". తప్పదు. లేకుంటే " పాచి " పేరుకుపోయే ప్రమాదముంటుంది.---- ఎవరి పెన్షన్లమీద వారు బ్రతుకుతున్నవారి పరిస్థితే ఇలా ఉంటే, ఆర్ధికంగా పిల్లలమీదే ఆధార పడ్డవారి జీవితాల గురించి ఊహించడానికే భయం గా ఉంది.
Sandwich జనరేషన్....
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 3, ఏప్రిల్ 2012, మంగళవారం
17 కామెంట్‌లు:
మీరు చెప్పింది నిజమే .
నిజమే.
it is very good.
i love your narration.
బాగా చెప్పారు...
open fact, the narration is very practical.
నిజమే. అర్ధం కాని పరిస్థితులు.
ఎవరి పెన్షన్లమీద వారు బ్రతుకుతున్నా, మాకేం ఇచ్చావు, మాకేం మిగిల్చావు అనే మాటలు కూడా వింటున్నాం.
ఒక తరం బంధాలు పెంచుకుంటే మరో తరం సడలించు కుంటోంది.
Very nice post
@మాలాకుమార్ గారూ,@శరత్ గారూ,
ఏకీభవించినందుకు ధన్యవాదాలు.
@యుద్దండి శివ సుబ్రహ్మణ్యం గారూ.
ధన్యవాదాలు.
@మాధవీ,
థాంక్స్..
@సుబ్రహ్మణ్యం గారూ,
బంధాలు పెంచుకోడమే తప్పనిపిస్తూంటుంది ఒక్కొక్కప్పుడు...
@ఫోటాన్,
థాంక్స్...
1 కాలవికృతమున పాలబడు కష్టజాలములకు భయమేలనే మనస |
జాలి దీర్చి భక్తపాలనజేయు | ఫాలనేత్రి మనపాల గల్గియుండ ||
2 ఈ వ్యాసములొ మిరు వ్రాసిన విషయాలన్ని అద్దంలో చూసినట్లున్నయి.
3. సంస్కారము,సాంప్రదాయాన్ని ప్రేమ మంచితనముతో కాపాడటనికి సాండ్విచ్ మధ్యన నలిగే ఆ పెద్దవాళ్ళ ఆ ప్రయత్నము వృధా కాదు.
4. కాలానుగుణంగా వచ్చే మార్పులను అంగీకరించి సత్యం ధర్మం నిలిపే ఈ పెద్దల ప్రయత్నం వాళ్ళ పిల్లలకి అర్ధం కాకపోదు.
ఫాస్టు ఫుడ్డు తినే ఈ జనరెషన్ కి ఆవకాయ గోంగూర గోరుముద్దల రుచి చూపించే పని ఆగదు
మీ స్పందనకి ధన్యవాదాలు.తరానికి తరానికి మధ్య ఇది తప్పదు. ప్రతి వారు ఈ దశ దాటవలసినదేను! దశ ముందు మాయ. దాటిన తరువాత మిధ్య.
well said, excellent
శివసుబ్రమణ్యంగారూ,
థాంక్సండి.
very interesting and life lessons. can I paste few important messages from your presentation. it will be useful to every one in FB. I once again show my gratitude to you.
Namaste.
excellent
my gratitude to you
very touching truth
కామెంట్‌ను పోస్ట్ చేయండి